4, జులై 2023, మంగళవారం


గురుశిష్యో భ్యో నమః    

                              


ఓం  సహనా వవతు సహనౌ భునక్తు 

సహవీర్యం కరవావహై 

తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై 

ఓం శాంతి : శాంతి : శాంతి :


బ్రహ్మ మన ఇరువురినీ రక్షించు గాక 

మన ఇరువురను పోషించు గాక 

ఇరువురం శక్తి మంతులం అవుదుము గాక .... 

అని గురు శిష్యుల మధ్య పరస్పర శ్రేయోకామన 

పరస్పర శ్రద్ధ అవసరం 


ఈ జ్ఞాన ప్రక్రియ అంతా ఓ దానమో ఒక స్వీకరణో కాదు 

మహోదాత్తమైన  యజ్ఞమందు ఇచ్చేవారిలో పుచ్చుకునే వారిలో కూడా 

ఆ యజ్ఞానికి ఆత్మార్పణే సమిధలుగా సమర్పించే అంకిత భావం ఉండాలి 


గురు శిష్యుల మధ్య అనుబంధం అవగాహన అనుసంధానం లేనట్లయితే 

ఒకరి మనోభావన అవతలి వారి హృదయాన్ని స్పృశించదు 

మనసులోనుంచి రాని విద్య  అవతలి వారి మనసును తాకని విద్య 

అభ్యాసం అవుతుందే కాని అధ్యయనం కాదు 



పాఠం చెప్పడమంటే శిష్యుడితో జ్ఞాన యజ్ఞం చేస్తున్న గురువు తాను 

జ్ఞానం ధారయామిగా జ్ఞాన దాన యజ్ఞం చేయాలి 

అలా చేసిన వాళ్ళే ఋషులు 


జ్ఞాన బోధనకు కుటుంబ సమేతంగా అంకితమై

 జ్ఞాన ధారను తమ ధ్యానధారగా సాధన చేసి 

తరించి పోయింది  ప్రాచీన గురు గణం 

ఆ శిష్య గణం మరో తరానికి అందించేందుకు 

పరిపూర్ణ  సమర్థతను ప్రోగు మరియు ప్రోది  చేసుకుంటుంది


జ్ఞానం ఐకమత్యానికి అజ్ఞానం వైవిధ్యానికి దారి 

తీస్తుందంటారు  శ్రీ రామకృష్ణులు తామిద్దరి  మధ్య 

వైవిధ్యాన్ని  తొలగించి ఐకమత్యాన్ని కలిగించడమన్నదే 

శాంతి  పాఠంలోని  ప్రార్థన 


అప్పుడే  ఒక దీపం నుంచి  మరో దీపం వెలిగినట్లుగా

 గురు శిష్యుల  సమరస  సామరస పరస్పర సహకారం 

శ్రద్ద గౌరవాల ఉదాత్త మార్పిడి  గురు శిష్యుల సమిష్టి 

ఉద్యమంగా భాసిల్లి జ్ఞానం వ్యాపించి లోకాన్ని 

జ్యోతిర్మయంగా  చేస్తుంది 

గురువు శిష్యుడికి ఫలాన్ని అందిస్తే  దాన్ని ప్రసాదంగా 

ప్రపంచానికి వితరణ చేస్తాడు శిష్యుడు 




ప్రారంభం  దశలో  గురువనే  హిమవన్నగ  శృంగాన్ని

 తెరిపార చూడటం కూడా శిష్యుడికి  సాధ్యం కాదు 

అది గ్రహించే  జ్ఞాన భాస్కరుడైన గురువు శిష్యుడితో 

ఏకాత్మగా స్థితుడై  భేషజం లేకుండా అభేధ భావన 

చేస్తే తప్ప మమేకం కాలేమని ద్వేషరాహిత్యాన్ని శక్తి 

సముపార్జనను  కోరుతూ శిష్య సహితంగా 

శాంతి ప్రార్థన  చేస్తున్నాడు గురువు 

                                      ఓం తస్మై శ్రీ గురవే నమః 





26, జూన్ 2023, సోమవారం

nisheedhi

                             

                                                                   నిశీధి 


 నలువైపులా  నిశీధి వీధి వీధి నిశీధి 

చీకటి తెమ్మరల ఆవలి అనంత  నిశీధి

 

గుణం రూపం తనలో  కలుపుకున్న 

నిర్గుణం నిరూపం  ఈ నిశీధి 


నలుపు తనలో నిలువుకున్న కాలవర్ణం  నిశీధి 

కారు చీకటి  ఈ నిశీధి  నిరాకారం ఈ నిశీధి 


నిశ్శబ్దం నిస్తేజం నింపుకున్న నిండుదనం  నిశీధి 

గాఢత అలుముకున్న గాఢాంధకారం ఈ నిశీధి 


రంగు రూపు కనుమరుగై ఏ రాత లేని నల్ల పలక  నిశీధి 

విసిగి వేసారిన వేదన ఈ  నిశీధి 


నిశీధి పయనం జీవనయానం సరళ రేఖలైన బ్రతుకు చీకటీ  నిశీధి 

మృత్యువు ముసుగు మరుగున మౌనమీ  నిశీధి 


ఈ  నిశీధి నా చుట్టూ  అలుముకున్న వేళ నాలో ఆ నిశీధి 

నిర్మల చిత్తం నాదైన  నిశీధి 

అగోచర అచింత్య అప్రాకృతిక  నిశీధి 

అస్తిత్వం పొగమంచై 

ఆధ్యాత్మిక  అక్షరంగా మారిన నిశీధి

సోహం  అంటూ వెలుగూ  చీకటీ  మమేకమైన 

ఓంకారం ఆ  నిశీధి

 నిర్వాణ కాంతి పుంజం 

ఉద్భవించే  ఆ గర్భసూన్యం 

ఆ నిశీధి  


21, ఏప్రిల్ 2020, మంగళవారం

పునాది రాళ్లు

 నిశీధికి  ఓ చిరుదివ్వె  మౌనవిన్నపం 

నీకు నాకు మధ్య
నీకు నాకు మధ్య మన దేశానికి 
పునాది రాళ్లు 
మనకి అందని తీరాలకి వారిని చేర్చాలనే  ఆరాటం 
ఉవ్వెత్తున లేచే  స్వార్థ  సమాజ కడలి  తరంగం 
పునాది రాళ్లు వారధిగా మారితేనే దేశఉజ్వల భవిత 
అబద్ధం ఆక్రమిస్తే  , శిలాశాసనం మునిగి తేలని నిజం ,
ధర్మం పునాది రాళ్ల శిథిలాల తో జీవశ్చవం 
ముందు తరాల నిశీధి జీవనం  

 నీ చేతిలో రెప రెప లాడే  చదువుల తల్లి  చిరుదివ్వె  
 నీ రక్షణ తో నవ సమాజ నిర్మాణం
 నా జీవన అద్భుత కావ్యం 

నన్ను మార్చాలనో  ఏమార్చాలనో  ప్రయత్నించకు
నేను ఎన్నటికైనా ఎగిరిపోయే పావురాయినే 
నేల మీద నా మనస్సు , నీ భుజం పై వ్రాలినప్పుడు 
నా ప్రేమ , ఆకాశంలో ఎగిరేటప్పుడు నా అంతరాత్మ
ఒకే పావురాయి 

బ్రతకాలనుకునే వారికి మార్పు 
నాలా బ్రతుకునీడ్చే వారికి కాదు 
పది వసంతాలు దూరంలో నా కోసం 
ఎదురుచూస్తున్న నా సాంత్వన ,
 నా బలహీనమైన  శరీరపంజరంలో  బంధీయైన 
నా పావురాయికి స్వేచ్ఛ నిచ్చే ఆ మృత్యుదేవత ఆహ్వానం 
తనలో ఐక్యమే నా తాదాప్యం

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

3, ఫిబ్రవరి 2020, సోమవారం

మీసం సొగసులు

మీసమే కదా మొగవాడి పౌరుషం
మీసం లేని బ్రతుకే నీరసం 
మీసం మగటిమి అందం 
మెలితిప్పే మీసమే రాజసం 
ముసలి మీసం కుర్ర మీసం నూనూగు మీసం 
వయస్సు తెలిపే బహువిధం 
మీసంతో పురుష  పుంగవ దరహాసం 
గాంభీర్య రాజస బంధనం
మీసం కోసమే ఈ ప్రాస బహుమానం 
మీసం లేని కుర్ర కుంక పిల్లాడే 
మీసం ఉన్న కుర్రోడు మొగాడే 
పురుషోత్తముడే 💎
పురుష మంత్రo పౌరుష మంత్రం 
మీసం భజంతి  పురుషం
 మీసం ! పురుషం తవ శరణం 
కావున ఓ  పురుషా మీసం విలువ తెలుసుకుని 
మీసమును   ప్రేమించుమన్నా 
మొలకెత్త  మీసమును గొరగకన్నా 
మొక్కలతో బాటు మీసమును పెంచుమన్నా 
ఏలనగా 
మీసమున్న వాడేను మొనగాడేనోయ్  !!


15, ఫిబ్రవరి 2019, శుక్రవారం

Victim of Entanglement

Bondage it seems
I struggle to get out of it
Towards freedom l fly
But after sometime

Loneliness, Abandonment
Touches my heart
With your invisible hand

I feel forsaken, aloof ,
forgetting my self
Again my existence lingers
For entanglement with you.


If this is called Love
At last it reveals itself
As a game As an illusion
             in which

My qualities being used
My self worth is at stake
A thought of use & throw
A feeling of victimisation
Engulfs my heart
And again circle starts
Repetition occurs
Once again it seems
Bondage


May be The free spirit encased
In the dove of entanglement
With platonic  love wings
Flying towards higher dimensions 

Ends the Entaglement cycle
Merging into  Emancipation.

8, ఫిబ్రవరి 2019, శుక్రవారం

ప్రిన్సిపాల్ vs మేనేజ్మెంట్


పెడ దారినే రహదారి అని మభ్యపెట్టే   మేనేజ్మెంట్లకి ప్రిన్సిపాల్స్ ఆవేదన నివేదన✍
నువ్వు మారితే ఏమవుతుంది?
విద్యా సంస్థ  కీర్తి పొందుతుంది

సమాజం మెరుగుపడుతుంది
తప్పు ఒప్పుని దిద్దుకుంటుంది
న్యాయం ఎన్నో మెట్లు ఎక్కుతుంది
అదే నేను మారితే ఏమౌతుంది ?సమాజం విద్యా విహీనమౌతుంది
తప్పు ఒప్పుని దిద్దుతుంది
న్యాయం దిగజారి పోతుంది
నా మార్పు కేవలం నీకు నీ కుటుంబానికి లాభాన్ని అందిస్తుంది
నీ మార్పు సమాజాన్నే మారుస్తుంది
నీ లాభ నష్టాల బేరీజై నిస్వార్థం వైపు మొగ్గు చూపుతుంది.
నీ ముందడుగు అవుతుంది
నీ వెంట ఎందరినో నడిపిస్తుంది
ఏ మార్పుని కోరుకుంటావో
నీ సొంత ఊరి పాఠశాలకి చెప్పు
నీ గ్రామ పసివాళ్లకి నేర్పు
నీకు చదువు నేర్పిన ఉపాధ్యాయులకి విన్నవించు.
కారణం నీ భవిష్యత్తు నేటి కర్మ అయి
నిన్ను వాళ్ల ముందు నిలబెడుతుంది
నీ మార్పు నిన్ను మహోన్నత వ్యక్తిగా  చిత్రీకరిస్తుంది.
✍✍✍

11, ఆగస్టు 2018, శనివారం

Raadhaa Vilasam


                                                                        హే కృష్ణా 



  నువ్వు ప్రక్కనుంటే ప్రకృతి అందమంతా అలంకరించుకున్నట్లు
  నువ్వు ఎదురుగా ఉంటే గుర్తింపు అలలా అలరిస్తున్నట్లు

  నీ కనుదోయి నా మదిలోకి తొంగి చూస్తే సమ్మోహనం
  నన్ను నలుదిశలా క్రమ్మేసినట్లు

  నీ మాటలతో వాస్థవానికి దూరంగా
  వయస్సు గతంలోకి పయనించి
  పరువంలో మరువంలా గుభాలిస్తున్నట్లు

నీ నవ్వులో నా స్వేచ్ఛ నింపాదిగా
రెక్కలు విప్పుకున్నట్లు
నా వైపు సాగే నీ అడుగులు నన్ను నిలువునా అల్లుకున్నట్లు
నీ అస్థిత్వం నన్ను మబ్బులా అలుముకున్నట్లు

నీ ప్రతీ రాక నన్ను వాన వెల్లువై తడిపేస్తుంది
ఆనందం వెన్నెలై నా హృదిని  పరుచుకుంటుంది
నా తనువును సహజాతం మృదువుగా స్పృశిస్తుంది

కాల వలయం నా జీవితంతో రాజీపడి
సమయాన్ని పట్టి కట్టి నిలిపేస్తుంది
స్నిగ్ధ మందహాస డోళికలలో ఓలలాడిస్తుంది 





1, జనవరి 2018, సోమవారం

Smarana Paryavasaanam

                                                       


 నిశ్చల మౌన మానస తటాకం
వ్యథా తప్త అశ్రు భరితం
వాక్ చేతనా భావనల సమ్మేళనం !
                                                                 
         
         
అలజడికి కారణమైన సహజ వైనం
విసిరిన గులక రాయితో గాయం
ఎగసి పడిన జలధి తరంగం !

హే మురారి ముకుందా !
గోవర్ధనోధారా ! గోపికానందనా !
                                                             












నీ నామస్మరణాన
అడుగంటు చేరు
 ప్రతి గులకరాయి మారును
 స్పటిక కర్పూర పట్టిక బెల్లం !
                                                                                 














కరుగు మరుక్షణం పొందు సుగంధం
నిర్మలమైన మది సరోవరం
 చక్కని చక్కెర తియ్యందనం నిండిన
జిలుగు మెరుపుల దృశ్యం  !

హే అచ్యుతా !
నీ రూపు ప్రతిఫలించు
స్వచ్ఛమైన మనోఫలకం !

హే జనార్దనా !
ప్రశాంత ఆనంద సంతృప్తి నిలయం
నిరతం నిను గాంచు హృది నయన కవాటం
క్షత గాత్రుల దాహార్తి ఉపశమన తరంగం !

త్వమేవ శరణం మమ అను అచేతనం
హే ! అభయ వరదా ! నీ అనుగ్రహం !



Related Posts Plugin for WordPress, Blogger...