నిశ్చల మౌన మానస తటాకం
వ్యథా తప్త అశ్రు భరితం
వాక్ చేతనా భావనల సమ్మేళనం !
విసిరిన గులక రాయితో గాయం
ఎగసి పడిన జలధి తరంగం !
హే మురారి ముకుందా !
గోవర్ధనోధారా ! గోపికానందనా !
నీ నామస్మరణాన
అడుగంటు చేరు
ప్రతి గులకరాయి మారును
స్పటిక కర్పూర పట్టిక బెల్లం !
కరుగు మరుక్షణం పొందు సుగంధం
నిర్మలమైన మది సరోవరం
చక్కని చక్కెర తియ్యందనం నిండిన
జిలుగు మెరుపుల దృశ్యం !
హే అచ్యుతా !
నీ రూపు ప్రతిఫలించు
స్వచ్ఛమైన మనోఫలకం !
హే జనార్దనా !
ప్రశాంత ఆనంద సంతృప్తి నిలయం
నిరతం నిను గాంచు హృది నయన కవాటం
క్షత గాత్రుల దాహార్తి ఉపశమన తరంగం !
త్వమేవ శరణం మమ అను అచేతనం
హే ! అభయ వరదా ! నీ అనుగ్రహం !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి