4, నవంబర్ 2026, బుధవారం

Vyakthitwam

 

                                                వ్యక్తిత్వం 


తన దంటూ  యోచన ఆచరణ ప్రత్యేక ప్రవర్తనే  వ్యక్తిత్వం 

మూసలోకి ఒదగని నైజం 

తనదైన  ఒక ప్రయోజనకరమైన ప్రపంచం 

అన్వేషణతో కపటాన్ని దరి చేరనీయని నిజం 

నిందించడానికి  దూరం 

నిర్భయాన్ని  ఎన్నుకునే సాహసం 

అంతర్మధనం ఆత్మశోధన అరుదైన వరం 

స్వేచ్చకు విలువిచ్చే వైనం 

వాస్తవాన్ని చూపించగలిగే దర్పణం 

కడగండ్లను ఎదుర్కునే పోరాటం 

కన్నీళ్ళను మింగి నిలిచే సహనం 

దైన్యాన్ని తోలి  నడిచే ధైర్యం 

ద్వేషానికి లోబడని నిర్మాల్యం 

పాప పుణ్యాల చిట్టా అనివార్యం 

స్వనిర్ణయం తీసుకోగలిగే వీర్యం 

నిజాయితీని నమ్ముకునే నిర్మొహమాటం  

అన్యాయాన్ని భరించని స్థైర్యం 

ప్రశంసలను ఆశించని పరితోషం  

నిగూఢ ఉద్దేశ్యాలలో దాగని సంతసం 

పునరావృతం అయ్యే సామాజిక వృత్తాలను చేధించే వాస్తవం 

సృష్టిలో పునఃసృష్టి చేసే మరో నవ్య భావనా తరంగం 

అవిద్యను పారద్రోలే జ్యోతిర్మయం 

విద్యను అక్కున చేర్చుకుని  భాసిల్లే ఓ వ్యక్తిత్వం 

పరావిద్య కై  పయనించే అమృతంగమయం . 

 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...