వ్యక్తిత్వం
తన దంటూ యోచన ఆచరణ ప్రత్యేక ప్రవర్తనే వ్యక్తిత్వం
మూసలోకి ఒదగని నైజం
తనదైన ఒక ప్రయోజనకరమైన ప్రపంచం
అన్వేషణతో కపటాన్ని దరి చేరనీయని నిజం
నిందించడానికి దూరం
నిర్భయాన్ని ఎన్నుకునే సాహసం
అంతర్మధనం ఆత్మశోధన అరుదైన వరం
స్వేచ్చకు విలువిచ్చే వైనం
వాస్తవాన్ని చూపించగలిగే దర్పణం
కడగండ్లను ఎదుర్కునే పోరాటం
కన్నీళ్ళను మింగి నిలిచే సహనం
దైన్యాన్ని తోలి నడిచే ధైర్యం
ద్వేషానికి లోబడని నిర్మాల్యం
పాప పుణ్యాల చిట్టా అనివార్యం
స్వనిర్ణయం తీసుకోగలిగే వీర్యం
నిజాయితీని నమ్ముకునే నిర్మొహమాటం
అన్యాయాన్ని భరించని స్థైర్యం
ప్రశంసలను ఆశించని పరితోషం
నిగూఢ ఉద్దేశ్యాలలో దాగని సంతసం
పునరావృతం అయ్యే సామాజిక వృత్తాలను చేధించే వాస్తవం
సృష్టిలో పునఃసృష్టి చేసే మరో నవ్య భావనా తరంగం
అవిద్యను పారద్రోలే జ్యోతిర్మయం
విద్యను అక్కున చేర్చుకుని భాసిల్లే ఓ వ్యక్తిత్వం
పరావిద్య కై పయనించే అమృతంగమయం .