5, ఆగస్టు 2023, శనివారం

HAASYAM .....With Due RESPECT intended

                        నిశ్శబ్ద తరగతులు


నిశ్శబ్ద తరగతులలో   

శబ్దం కోసం 

విరహంతో విలపిస్తున్నా !😔

 

అనాథ ప్రేతాల్లా స్టాఫ్ రూమ్ లో 

ముచ్చటగా ముగ్గురం 

ముచ్చటైన ముగ్గురం ! 👽👽👽


ముచ్చట్ల మురిపం తీరే లోపే

సమర నాదం  యుద్ధ వాదం

విత్తు ముందా చెట్టు ముందా !😌


బొమ్మ వేస్తే బొరుసు  

బొరుసు పడితే బొమ్మ 

బొమ్మా  బొరుసా ఆలోచించే లోపే 

కాలికేస్తే మెడకి మెడకేస్తే కాలికి !😟


ఏమి చేయాలో తెలియని అయోమయం 

సహకరించని సాయుధ గణం !

డిస్కషన్ ఆర్గుమెంట్  అయ్యే లోపే

క్రింద హాల్ లో  సెలబ్రేషన్ 

కర్ణభేరి భరించలేని  ఢమరుక నాదం !

అంతలోనే 

ఒకరికొకరు ఇచ్చుకునే సాంత్వన 

అటుపై నిశ్శబ్ద వీచిక !💔💙


ఆడవారు మాట్లాడుకోనే  వద్దు 

నెగిటివ్ గా ........  రెడ్డిగారి హెచ్చరిక 

పాజిటివ్ గా  అత్తగారింటి గురించి 

ఏ కోడలైనా మాట్లాడిందా ?

మాట్లాడినా ఆడవారి మాటలకు 

అర్థాలే వేరులే 

సగం నిండు అంటే సగం ఖాళీనే 

 పాపం పండిన పండు 

 పాపం పరేషాన్ !😀😝


ఎవరిని ఎవరు పరిపాలిస్తున్నారు 

సైన్న్యాన్ని సామ్రాట్తా ? 

సామ్రాట్టుని సైన్యమా ?

లేదా 

అందర్నీ అధిరోహించి స్వారీ చేసి, 

ఉపాధ్యాయుల్ని తయారుచేసే 

కర్మాగారాన్ని, భర్తీ చేసే 

సైన్యాధ్యక్షుడా పరిపాలన గావించేది ? 🙆


రోజులెలా గడుస్తున్నాయో 

ఆకసాన్ని అడగాలి వంగి నేలను 

స్పృశిస్తున్నావేంటి అని 

SPIRITUALITY & MATERIALISM 

ప్రతీసారి అవి కలిసే చోటు 

ఏది నిజమో ఏది మాయో 

ఎవరు గురువో ఎవరు శిష్యులో 

తెలియని 

నాతో నేను, నాలో నేను 

నిరంతర ఘర్షణ సంఘర్షణ !😨


                           హే భగవన్ 

జిందగీ హర్ కదం ఏక్ నయి జంగ్ హయ్ 

జీత్ జాయేంగే హాఁ అగర్  తూ సన్గ్ హై

                               🙏🙏🙏            

                https://youtu.be/m-ZOReY92p0

                                              🙈🙉🙊

           

22, జులై 2023, శనివారం

????......

 

ఏమి జరిగిందంటే ఏమి చెప్పను !


సుడిగాలి ఉధృతానికి విరిగిన శకలాలని 

నేల కొరిగిన శిధిలాలని నెమ్మనెమ్మదిగా 

ఒక్కొక్కటే ఏర్చి పేర్చుకుంటున్నానని చెప్పనా !


విరిగిన శకలమే కదా అంటావేమో

 అది నా ఆత్మస్థైర్యమని నీకు తెలియదా ?

ఆ శిధిలాలలో నేల కొరిగిన 

నేను అనే నా అస్తిత్వం నీకు కనిపించలేదా ?


నీకు ఎలా తెలుస్తుందిలే ? బలహీనత 

నీ కళ్ళకు గంతలు కట్టింది కదా !

మనసు మరుగున మృదుత్వం  

కారుణ్యరహితంగా  కాఠిన్యాన్ని సంతరించుకుంది కదా !


నేను చేసిన తప్పేంటి ?

 నన్ను నేను 

ఎన్నిసార్లు ప్రశ్నించుకున్నా 

ఎన్నెన్ని వేళల నిలదీసుకున్నా 

అనంత సూన్యం బావురుమన్నది 


విలువలు అవసరం లేదంటున్న సమాజాన్ని

 ఇవిగివిగో వీటిని పాటించమనడం 

ఎంతటి నిర్హేతుకం !

నిశ్చయమే లేని  గమనానికి 

గమ్యం విడమరచి వివరించడం

 ఎంతటి నిశిద్ధం !


ఓ బాటసారి బాట నీది గమ్యం నీది 

గమనం నీది కానీ స్వప్నం నాది 

అందుకే నా స్వప్న విరచిత 

నవ గీతికలకు ఈ నీ అపస్వరాలు 

అందుకే నా స్వప్న విరచిత 

నవ సాదృశ్యానికి ఈ నల్లటి రంగుల మరకలు 

ఒక జీవితానికి  సరిపోయేటంత కన్నీటి వరదలు 

చివరి వరకు మిగిలిపోయే తుషార చారకలు 


సుడిగాలి వెళ్లిపోయిందని సంతసించనా 

తను పేర్చిన అక్షర నష్టాన్ని నెమరు వేసుకుని 

లెక్కకట్టి పరితపించనా ?

అక్షరాల గాయాలు నిరంతరం బాధిస్తుంటే 

మందే లేని కాలంతో పయనించనా ?


మానని వ్యథ మారని మనిషి 

తీరని దాహం సమాధానమే లేని ప్రశ్న 

నన్ను ఈ నిర్గమనమైన దారిలో  

 అందరికి అగుపించని పూతోటలో 

అంతర్ పయనంలో ఆత్మ శోధనలో 

నిస్సంగత్వం తోడైన శాంతి బాటలో 

నడిపిస్తుందని తెలుపనా !


సమాజ స్రవంతి తీర్చని దాహార్తి 

నాలో అంతర్వేది తీర్చిందని చెప్పనా ?

 


గురుతర బాధ్యత -----బోధకుని నిరంతర వ్యథ 

వికలమైన విద్యా వ్యవస్థ ------పతనమయే విద్యార్ధి దిశ 


18, జులై 2023, మంగళవారం

Refraction

                

                                         పరావర్తనం 

గతించిన కాలవాహినిలో జ్ఞప్తికలు దీపికలై  

స్వీయ చరిత్ర పై వెలుగులు ప్రసరిస్తుంటే 

నిశిలో నీడకై  వెతుకులాట 

నిరర్ధక నిరపయోజనాలై

 నిజం కేవలం నేడే అంటుంటే  

ఓ రూపం  అజరామరమై 

కలకాలం నిలుస్తుందనుకుంటే 

చెదరి రూపురేఖలు వేరైన  సారూప్యత

 కొనసాగింపై  

ఆగర్భతిమిరాంధకార గుహలో 

వెలుగై  దైవమై 

వెలసిన  ప్రతిబింబము చెరగనీకుమా 

కాలగమనమా !  చిత్తచాంచల్యమా !            



9, జులై 2023, ఆదివారం

PRATHI SRUSTI

              
                                                                     ప్రతిసృష్ఠి 


                భావనలు వర్షిస్తే మనసుల్ని స్పర్శించే 
  
                మృదువైన కవిత కలం నుంచి జాలువారితే 
                   
                భువి ఆసాంతం జయించిన 

                  కవి హృదయస్పందనం  

కనులను  చేరిన క్షణం లోనే 

 రంగులద్దుకున్న కుంచె 

మనోనేత్రసౌధాలలో తివాచీలై  పరుచుకున్న 

బహు సుందర వర్ణ చిత్రం చిత్రీకరించి 

సౌందర్య సామ్రాజ్యానికి కిరీటం లేని

మహా రాజై విరాజిల్లు  

చిత్రకారుని నయన లాస్యం 


                                                  స్వరతరంగాలలో తేలియాడుతూ 

                                                   నవ  నాడులను మీటుతూ    

                                                   సప్త యోగ చక్రాలను స్పృశిస్తూ 

                                                   వాగేయ మేరువు ఆశీర్వాదంతో

                                                   గురుని ఆధారంతో  

                                                   సంగీత  సాగర మథనం కావించి 

                                                   కీర్తనల అమృతం చిలికి 


శ్రోతల్ని అమరులని  మైమరపించే 

గాయకుడి తన్మయత్వం 

గంధర్వలోకం పై దిగ్విజయం 

ప్రాప్తించిన  గాన  గాంధర్వ సాధనా సప్తమం   


                                                         రాళ్ళలో రాగాలు పలికించి 

                                                        రసజ్ఞత పొందుపరిచి 

                                                      కంటి మెరుపులు వింటి  విరుపులు 

                                                       నున్నదనం లాఘవంగా  చెక్కి 

                                                         ఉలితో   వివరాలు విశదీకరించి  

                                                              శిల్ప కళతో కట్టిపడేసే శిల్పి 

                           కళాత్మక  జగ్గత్తుని   శ్వాప్ణికమో సత్యమో మనకే మిగిల్చే

                                                           తరతరాలుగా నిలిచే సృష్టి 

                                                    అమోఘ  ప్రతిసృష్టిని   ప్రతిష్టించే

                                                         సుందర స్వరాజ్యాలను 

                                                       గెలిచిన శిల్పి  సజీవ దరహాసం   

                                      

                       పరమానందం ఇటువంటి ఎన్నెన్నో అద్భుతమైన 

                                 మహా సామ్రాజ్యాలలో

                        నెలవై  ఉంటే పదవులకై వెంపర్లాడుతూ 

                        ధనంతో త్వమేవాహం అంటూ 

                          ఆనందం కోసం కరువ్వాచి

                       నలుదిశలా పరువులెత్తుతున్న 

                                    వింతలోకం 



                       

                                                   

4, జులై 2023, మంగళవారం


గురుశిష్యో భ్యో నమః    

                              


ఓం  సహనా వవతు సహనౌ భునక్తు 

సహవీర్యం కరవావహై 

తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై 

ఓం శాంతి : శాంతి : శాంతి :


బ్రహ్మ మన ఇరువురినీ రక్షించు గాక 

మన ఇరువురను పోషించు గాక 

ఇరువురం శక్తి మంతులం అవుదుము గాక .... 

అని గురు శిష్యుల మధ్య పరస్పర శ్రేయోకామన 

పరస్పర శ్రద్ధ అవసరం 


ఈ జ్ఞాన ప్రక్రియ అంతా ఓ దానమో ఒక స్వీకరణో కాదు 

మహోదాత్తమైన  యజ్ఞమందు ఇచ్చేవారిలో పుచ్చుకునే వారిలో కూడా 

ఆ యజ్ఞానికి ఆత్మార్పణే సమిధలుగా సమర్పించే అంకిత భావం ఉండాలి 


గురు శిష్యుల మధ్య అనుబంధం అవగాహన అనుసంధానం లేనట్లయితే 

ఒకరి మనోభావన అవతలి వారి హృదయాన్ని స్పృశించదు 

మనసులోనుంచి రాని విద్య  అవతలి వారి మనసును తాకని విద్య 

అభ్యాసం అవుతుందే కాని అధ్యయనం కాదు 



పాఠం చెప్పడమంటే శిష్యుడితో జ్ఞాన యజ్ఞం చేస్తున్న గురువు తాను 

జ్ఞానం ధారయామిగా జ్ఞాన దాన యజ్ఞం చేయాలి 

అలా చేసిన వాళ్ళే ఋషులు 


జ్ఞాన బోధనకు కుటుంబ సమేతంగా అంకితమై

 జ్ఞాన ధారను తమ ధ్యానధారగా సాధన చేసి 

తరించి పోయింది  ప్రాచీన గురు గణం 

ఆ శిష్య గణం మరో తరానికి అందించేందుకు 

పరిపూర్ణ  సమర్థతను ప్రోగు మరియు ప్రోది  చేసుకుంటుంది


జ్ఞానం ఐకమత్యానికి అజ్ఞానం వైవిధ్యానికి దారి 

తీస్తుందంటారు  శ్రీ రామకృష్ణులు తామిద్దరి  మధ్య 

వైవిధ్యాన్ని  తొలగించి ఐకమత్యాన్ని కలిగించడమన్నదే 

శాంతి  పాఠంలోని  ప్రార్థన 


అప్పుడే  ఒక దీపం నుంచి  మరో దీపం వెలిగినట్లుగా

 గురు శిష్యుల  సమరస  సామరస పరస్పర సహకారం 

శ్రద్ద గౌరవాల ఉదాత్త మార్పిడి  గురు శిష్యుల సమిష్టి 

ఉద్యమంగా భాసిల్లి జ్ఞానం వ్యాపించి లోకాన్ని 

జ్యోతిర్మయంగా  చేస్తుంది 

గురువు శిష్యుడికి ఫలాన్ని అందిస్తే  దాన్ని ప్రసాదంగా 

ప్రపంచానికి వితరణ చేస్తాడు శిష్యుడు 




ప్రారంభం  దశలో  గురువనే  హిమవన్నగ  శృంగాన్ని

 తెరిపార చూడటం కూడా శిష్యుడికి  సాధ్యం కాదు 

అది గ్రహించే  జ్ఞాన భాస్కరుడైన గురువు శిష్యుడితో 

ఏకాత్మగా స్థితుడై  భేషజం లేకుండా అభేధ భావన 

చేస్తే తప్ప మమేకం కాలేమని ద్వేషరాహిత్యాన్ని శక్తి 

సముపార్జనను  కోరుతూ శిష్య సహితంగా 

శాంతి ప్రార్థన  చేస్తున్నాడు గురువు 

                                      ఓం తస్మై శ్రీ గురవే నమః 





26, జూన్ 2023, సోమవారం

nisheedhi

                             

                                                                   నిశీధి 


 నలువైపులా  నిశీధి వీధి వీధి నిశీధి 

చీకటి తెమ్మరల ఆవలి అనంత  నిశీధి

 

గుణం రూపం తనలో  కలుపుకున్న 

నిర్గుణం నిరూపం  ఈ నిశీధి 


నలుపు తనలో నిలువుకున్న కాలవర్ణం  నిశీధి 

కారు చీకటి  ఈ నిశీధి  నిరాకారం ఈ నిశీధి 


నిశ్శబ్దం నిస్తేజం నింపుకున్న నిండుదనం  నిశీధి 

గాఢత అలుముకున్న గాఢాంధకారం ఈ నిశీధి 


రంగు రూపు కనుమరుగై ఏ రాత లేని నల్ల పలక  నిశీధి 

విసిగి వేసారిన వేదన ఈ  నిశీధి 


నిశీధి పయనం జీవనయానం సరళ రేఖలైన బ్రతుకు చీకటీ  నిశీధి 

మృత్యువు ముసుగు మరుగున మౌనమీ  నిశీధి 


ఈ  నిశీధి నా చుట్టూ  అలుముకున్న వేళ నాలో ఆ నిశీధి 

నిర్మల చిత్తం నాదైన  నిశీధి 

అగోచర అచింత్య అప్రాకృతిక  నిశీధి 

అస్తిత్వం పొగమంచై 

ఆధ్యాత్మిక  అక్షరంగా మారిన నిశీధి

సోహం  అంటూ వెలుగూ  చీకటీ  మమేకమైన 

ఓంకారం ఆ  నిశీధి

 నిర్వాణ కాంతి పుంజం 

ఉద్భవించే  ఆ గర్భసూన్యం 

ఆ నిశీధి  


21, ఏప్రిల్ 2020, మంగళవారం

పునాది రాళ్లు

 నిశీధికి  ఓ చిరుదివ్వె  మౌనవిన్నపం 

నీకు నాకు మధ్య
నీకు నాకు మధ్య మన దేశానికి 
పునాది రాళ్లు 
మనకి అందని తీరాలకి వారిని చేర్చాలనే  ఆరాటం 
ఉవ్వెత్తున లేచే  స్వార్థ  సమాజ కడలి  తరంగం 
పునాది రాళ్లు వారధిగా మారితేనే దేశఉజ్వల భవిత 
అబద్ధం ఆక్రమిస్తే  , శిలాశాసనం మునిగి తేలని నిజం ,
ధర్మం పునాది రాళ్ల శిథిలాల తో జీవశ్చవం 
ముందు తరాల నిశీధి జీవనం  

 నీ చేతిలో రెప రెప లాడే  చదువుల తల్లి  చిరుదివ్వె  
 నీ రక్షణ తో నవ సమాజ నిర్మాణం
 నా జీవన అద్భుత కావ్యం 

నన్ను మార్చాలనో  ఏమార్చాలనో  ప్రయత్నించకు
నేను ఎన్నటికైనా ఎగిరిపోయే పావురాయినే 
నేల మీద నా మనస్సు , నీ భుజం పై వ్రాలినప్పుడు 
నా ప్రేమ , ఆకాశంలో ఎగిరేటప్పుడు నా అంతరాత్మ
ఒకే పావురాయి 

బ్రతకాలనుకునే వారికి మార్పు 
నాలా బ్రతుకునీడ్చే వారికి కాదు 
పది వసంతాలు దూరంలో నా కోసం 
ఎదురుచూస్తున్న నా సాంత్వన ,
 నా బలహీనమైన  శరీరపంజరంలో  బంధీయైన 
నా పావురాయికి స్వేచ్ఛ నిచ్చే ఆ మృత్యుదేవత ఆహ్వానం 
తనలో ఐక్యమే నా తాదాప్యం

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

3, ఫిబ్రవరి 2020, సోమవారం

మీసం సొగసులు

మీసమే కదా మొగవాడి పౌరుషం
మీసం లేని బ్రతుకే నీరసం 
మీసం మగటిమి అందం 
మెలితిప్పే మీసమే రాజసం 
ముసలి మీసం కుర్ర మీసం నూనూగు మీసం 
వయస్సు తెలిపే బహువిధం 
మీసంతో పురుష  పుంగవ దరహాసం 
గాంభీర్య రాజస బంధనం
మీసం కోసమే ఈ ప్రాస బహుమానం 
మీసం లేని కుర్ర కుంక పిల్లాడే 
మీసం ఉన్న కుర్రోడు మొగాడే 
పురుషోత్తముడే 💎
పురుష మంత్రo పౌరుష మంత్రం 
మీసం భజంతి  పురుషం
 మీసం ! పురుషం తవ శరణం 
కావున ఓ  పురుషా మీసం విలువ తెలుసుకుని 
మీసమును   ప్రేమించుమన్నా 
మొలకెత్త  మీసమును గొరగకన్నా 
మొక్కలతో బాటు మీసమును పెంచుమన్నా 
ఏలనగా 
మీసమున్న వాడేను మొనగాడేనోయ్  !!


15, ఫిబ్రవరి 2019, శుక్రవారం

Victim of Entanglement

Bondage it seems
I struggle to get out of it
Towards freedom l fly
But after sometime

Loneliness, Abandonment
Touches my heart
With your invisible hand

I feel forsaken, aloof ,
forgetting my self
Again my existence lingers
For entanglement with you.


If this is called Love
At last it reveals itself
As a game As an illusion
             in which

My qualities being used
My self worth is at stake
A thought of use & throw
A feeling of victimisation
Engulfs my heart
And again circle starts
Repetition occurs
Once again it seems
Bondage


May be The free spirit encased
In the dove of entanglement
With platonic  love wings
Flying towards higher dimensions 

Ends the Entaglement cycle
Merging into  Emancipation.

8, ఫిబ్రవరి 2019, శుక్రవారం

ప్రిన్సిపాల్ vs మేనేజ్మెంట్


పెడ దారినే రహదారి అని మభ్యపెట్టే   మేనేజ్మెంట్లకి ప్రిన్సిపాల్స్ ఆవేదన నివేదన✍
నువ్వు మారితే ఏమవుతుంది?
విద్యా సంస్థ  కీర్తి పొందుతుంది

సమాజం మెరుగుపడుతుంది
తప్పు ఒప్పుని దిద్దుకుంటుంది
న్యాయం ఎన్నో మెట్లు ఎక్కుతుంది
అదే నేను మారితే ఏమౌతుంది ?సమాజం విద్యా విహీనమౌతుంది
తప్పు ఒప్పుని దిద్దుతుంది
న్యాయం దిగజారి పోతుంది
నా మార్పు కేవలం నీకు నీ కుటుంబానికి లాభాన్ని అందిస్తుంది
నీ మార్పు సమాజాన్నే మారుస్తుంది
నీ లాభ నష్టాల బేరీజై నిస్వార్థం వైపు మొగ్గు చూపుతుంది.
నీ ముందడుగు అవుతుంది
నీ వెంట ఎందరినో నడిపిస్తుంది
ఏ మార్పుని కోరుకుంటావో
నీ సొంత ఊరి పాఠశాలకి చెప్పు
నీ గ్రామ పసివాళ్లకి నేర్పు
నీకు చదువు నేర్పిన ఉపాధ్యాయులకి విన్నవించు.
కారణం నీ భవిష్యత్తు నేటి కర్మ అయి
నిన్ను వాళ్ల ముందు నిలబెడుతుంది
నీ మార్పు నిన్ను మహోన్నత వ్యక్తిగా  చిత్రీకరిస్తుంది.
✍✍✍
Related Posts Plugin for WordPress, Blogger...