ప్రపంచం అంతా రంగులమయం V
తెలుపు నలుపుల సమాగమ౦
ఇంద్రధనస్సులో రంగులన్నిటికి
తెలుపు నలుపుల మధ్యే నిలయం I
ముదిత పలు వన్నెల గాజుల వలయాలు
ధ్యానంలో కనుబొమల మధ్య రంగు రంగుల వృత్తాలు B
వశీకరణకు ఆరంభాలు
వశీకరణకు ఆరంభాలు
చినుకు స్పటికంలో విడివడిన సూర్య కిరణం
ఆకాశానికే రంగు రంగుల ఇంద్రధనువుల తోరణం G
పడతి సిగలో అల్లుకున్న మరుమల్లెల తెల్లదనం
భామ దరహాసంలో వెల్లివిరిసే తియ్యందనం
శరత్ చంద్రికల హాసంలో విరిసే వెన్నెల చల్లదనం Y
ఎగిరే తెల్లని శాంతి కపోతం
ఆద్యాత్మికతకు చిహ్నం తెల్లదనం
స్వచ్చతకు మారుపేరు ఈ తెల్లన్ దనం
నల్లని కారు మేఘ వర్ణం
చిలిపి కృష్ణుని సోయగం
శ్రీ రాముని తనూరవర్ణం
నిశీధి రేయి గాడా౦ధకార వర్ణం o
అలివేణి కురుల నల్లదనం
జ్యోతిర్లింగాల నల్ల౦దనం
నల్లని ధన౦ నల్లధనం
మంచి చెడుల , తెలుపు నలుపుల
కలయికే ఈ ప్రపంచం
మంచి చెడుల వ్యత్యాసం కఠినం R
మధ్యస్థంగా వివిధ వర్ణాలలో , ఎన్నెన్నో శాతాలలో
మంచి చెడుల మిశ్రమం
కలకంఠి కనుపాపల వెలుగు నీడల స్వప్న వర్ణం B & W
తెలుపు నలుపుల మేళనం
జగతికే అగుపించని ఓ వరం