13, అక్టోబర్ 2024, ఆదివారం

Karma Kshyayam

 

కర్మ  క్షయమిది  కావాలె కావాలె  కర్మల నోర్చెడి   ధీరత నీయవె  


https://youtu.be/Q4z-nL2sZdk?si=62kHXLSa2PJ6tsg-

25, సెప్టెంబర్ 2024, బుధవారం

Avahanadi Mudras and Universe

              

                                                     


  

                                        https://youtu.be/apyd8qfA2CY?si=1h5K9ICTl4qYQk7j    

అమ్మా శ్రీ మాతా  

అంతర్మధనం నుండి 

ప్రశాంత చిత్తంతో నిను 

నా సమక్షానికి  ఆహ్వానిస్తున్నాను 

అంతర్గత  హృదయ వాసిని  

నిను నాలో నుంచి 

 బహిర్గత పరుస్తున్నాను 

క్షంతవ్యురాలిని తల్లీ 

"ఆవాహిత భవ"  !

Internal to External 


https://youtu.be/bhofN1xX6u0?si=2gI-ckwFuIS3LmLP


నా లోని సూక్ష్మ విశ్వం నుంచి 

ఈ అనంత విశ్వము వరకు 

సూక్షమానంతాలు రెంటినీ ఏలేటి తల్లి 

నీ యందు నా ధ్యానం సుస్థిరమగునట్లు 

నా ఇలవేలుపువై నెలకొనవమ్మా 

అమ్మా "సంస్థాపితాభవ" !

Microcosm to Macrocosm 


https://youtube.com/shorts/56CJws6M5WU?si=bi7aYPWdO8SMZiJu


సంపూర్ణ వైన నీలో ఐక్యం అవడానికి 

సూన్య స్థితి జ్ఞప్తికవై  

నా మానస సరోవరమందు 

ఉద్భవించు  అద్వైత తరంగిణి 

మాతా "సన్నిధాపితా భవ" !

Black Hole  &  "0 Dimension" 

https://youtube.com/shorts/vOM8NngVBIw?si=qyT0T2e5TWFL6cOY


     నేను  అనే అస్తిత్వమే లేని

     అనుభవం ఈ  సూన్య ప్రవేశం 

     ఆకర్శక పరమానందం 

      అమ్మా నీ  మాయోపేత చిద్విలాసం 

     ఓ నిశీధి వలయం 

      కాళ రాత్రికి ఆనవాలం 

      బిందుసమాయుక్తం 

      జననీ మమ "సన్నిరుద్ధా  భవ"    

      Enter Nothingness / Black Hole 

https://youtube.com/shorts/haB7jBqXbOI?si=wMb1ODfM9NoqU-4v

 

బహుళ విశ్వాలలో ఒక నిశీధి

 ఆకర్షక శక్తి కేంద్రం నుండి

 మరో శ్వేత  శక్తి కేంద్రానికి  వారధి 

 ఓ  "  సొరంగ "  పయనం 

అమ్మా నీ చేయూత పరమార్ధానికి ప్రతీక 

జననీ  " సుముఖీభవ "

Transcendence & Worm hole 


https://youtube.com/shorts/lcz4XX8Kk98?si=wcyGJo2BsAJ51blS


కాల గమనం కాల తిరోగమనం

 సూన్యంను చేరి పూర్ణత్వం 

కాల పురుష జ్ఞాన అజ్ఞాన 

ద్వందమేకమైన   చైతన్య  చక్ర వలయం 

జగన్మాతా  దేహిమే  తవ  సాయుజ్యం 

దేహిమే  పరిపూర్ణత్వ 0  జన్మరాహిత్య0  

త్వా 0    శ్రీ చక్ర సంచారిణీం 

మాతా  శ్రీ విద్యా   అవకుంఠితా  భవ 

Time Leading  to Nothingness 


https://youtube.com/shorts/jfe-ruLgaNo?si=gogi--U8W81QZ0R-

https://youtube.com/shorts/FBmjqEJKIj8?si=x9mg5Rfs-a0UBtne


         


https://youtube.com/shorts/KguE_UbgZ5A?si=wz8y9Zk8sGN56tAc

https://youtu.be/kgFO2JtcFMk?si=KqLrIZJ0Jk041zL9  


                       


                                         అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే   

                                                                           🙏🙏🙏        

                                        https://youtu.be/O_WJVPTkKO8?si=oV1sEu8EumzRpzFU                                           

                        

                                       

12, సెప్టెంబర్ 2024, గురువారం

Paalapuntha Darsanam

 పాల పుంత  దర్శనం 


  విశ్వమూర్తి  శయనాగారం  

 క్షీరాంబుధి  శ్రీనివాసం

 శ్రీ రంగనాథుని పర్యంకాసనం 

విష్ణు నాభి స్థితం బ్రహ్మ కమలం   

బ్రహ్మ నివాసం 

బ్రహ్మా0డ సృజనాధారం 

సృష్టి స్థితి  లయకారం 

పాలపుంత నిదర్శనం 





                         



22, మార్చి 2024, శుక్రవారం

                           ఇరువైపులా నిలువెత్తు  నిజం 

    

ఒకరు వ్రాసిన write up చదివాక అందులో పదాలు గమనించిన  నాకు తట్టిన సరిజోడు  పదాలు 



            

                తన  పదాలు                                                                                                                                              నా  పదాలు 

 

1. ఏ మనిషి సంతోషంగా ఉండలేడు 


 

1   కణం  అమరిక 


 2 మనసుల్లో విభజన గుణం 


 

2  కణ విభజన 


 3 పోటీతత్వం 



3 ఎదుగుదల 


 4 ప్రేమ మంచితనం నటన 


 

4 వ్యక్తి / వ్యక్తిత్వం 


 5 మానసిక హింస 


 

5 సమిష్టి కృషి 


 6 మానసిక శత్రుత్వం 


 

6  సంఘం / సమాజం 


 7 ఆంతరంగీక  విద్వేషాలు 



7 ప్రపంచం 


 8 పేరెంట్స్ హింస 



8 భూగోళం  ఖగోళం 


 9 అప్పులు వడ్డీలు 


 

9 సౌర మండలం 


 10 ఆధిపత్యం 


 

10 పాలపుంత , అనంతం 

   

   Narrow view                                    Broad View                                                   

ప్రేమను  సంకుచితం                 ప్రేమను విశ్వ వ్యాప్తకం       

చేసే పదాలు                                      చేసే పదాలు 

Reveals                                                    Reveals 

Anger                                                      An Eagle View 

Frustration                                              Encompassing 

Blues                                                        Wholistic / Holistic 


కృత్రిమ విభజన సహజ ఐకమత్యానికి  దారి వేస్తుంది 



 

29, ఆగస్టు 2023, మంగళవారం

Naana ....Nenu

                                                     నాన్న - నేను 


అందరూ మాతృదేవో భవ అంటూ తల్లినే శ్లాఘిస్తారు 

నవమాసాలు మోసేది తల్లి కాని 

ఆ నవ మాసాలు ఆ తల్లి తో బాటు తన బిడ్డను కాపాడుకునే 

పోషించే తండ్రిని అందరూ దాదాపు మరిచిపోతారు 


అమ్మ కమ్మని మాట మరి  

నాన్న ప్రేమ నిండిన మూట అనురాగపు బాట 

మృత్యువు అమ్మని దూరం చేస్తే 

విధి నాన్నని దూరం చేసింది 


దాదాపు పదేళ్లు నాన్న దగ్గర లేకపోయినా 

అతను నేర్పిన ఎన్నో విలువలు 

నన్ను ముందుకు నడిపించాయి 

నాన్న ఒక మహావృక్షం 

నాన్న మహామనిషీ ఎంతో సాధించాడు 

ఇలా చెప్పుకోవడానికి  ఏమి లేవు కాని 

తన ఉద్యోగ నివృత్తిలో ఎంతో 

నిజాయితీ పరిపూర్ణత చూపించాడు

నాన్నని చూసి అతని ప్రవర్తన ద్వారా నేర్చుకున్నవే ఎక్కువ 

ఏది చెప్పినా నాలుగు మాటలలో జీవిత సత్యాన్ని విలువలని 

అతి సుళువుగా ఏదో ఒక నానుడిలేదా 

సామేతతో జోడించి చెప్పేవారు . 

నాన్న ప్రశాంతత నిర్మలత్వం మంచితనం సహనం

 నిరంతరం నన్ను స్పర్శిస్తూనే ఉంటాయి

నాన్న వెళ్ళిన తరువాత కూడా తాను ఉన్నట్లే 

భావ పరంపరలు వైబ్రేషన్స్ కలుగుతాయి 

నాన్నకి ఎంతో ఓర్పు అమ్మలో 

ఎప్పుడూ నే చూడని ఓర్పు నాన్నలో కనిపించేది 


నాన్న Archeologist గుళ్ళు ఊర్లు తిరిగేవారు

 అక్కడ ప్రాచుర్యం లో ఉన్న కథలు సేకరించి 

అక్కడి విశేషాలన్ని చక్కగా పూస గుచ్చినట్లు వివరించేవారు 

అలా ఎన్ని కథలు విన్నానో !

ఎన్నో ఏళ్ళ తరువాత  మా పాపకి ఓ సారి కథ చెబుతుంటే 

ఇల్లు చిమ్ముతున్న నేను గడ్డం గీసుకుంటున్న మా వారు

అలాగే చేసే పని ఆపేసి కథ అయ్యే వరకు 

అలాగే శిలలలాగా నిలబడిపోయాము 

ఎవరో "stop" అన్నట్లు  

నాన్న "A Great story  teller " ఇన్నేళ్ల తరువాత కూడా 

అంతే ఉత్కంఠత మాలో కలిగించేలా చెప్పారు 


నాన్న లో కనిపించనిది అహంకారం 

మచ్చుకైనా ఎంత వెతికినా అది  కనిపించేది కాదు 

ఒక రోజు హోటల్లో  డిన్నర్ చేసి  బైటికి  వస్తున్నాము 

డోర్ దగ్గర డోర్ కీపర్ వినయంగా నమస్కారం చేశాడు 

సహజంగా అందరూ  అతనికి డబ్బులు ఇస్తారు 

నాన్న మాత్రం అతనికి చక్కగా చేతులెత్తి నమస్కరించారు 

ఆ నిముషం అందరం నవ్వేశాం  doorkeeper తో సహా 

డోర్ కీపర్ కళ్ళలో మెరుపు నవ్వులో కాస్త సిగ్గు తొణికిసలాడాయి 

ఆ తర్వాత నాకు కూడా అనిపించింది 

నమస్కారానికి ప్రతిగా చేయాల్సింది నమస్కారం కదా 

మరి ఈ దండానికి డబ్బుకి ముడి పెట్టడం అవసరమా ?

అందరం మనుషులమైనా ఒకరిని దండం క్రిందికి జార్చి చులకన చేస్తే 

దానం ఒకరిని పై మెట్టున నిలబెట్టి స్థాయి పెంచుతుంది 


డబ్బు కోసం నమస్కారం 

డబ్బుకి నమస్కారం 

అంతటా నివసించే పరమాత్మకి నమస్కారం 

ఎదుటి వ్యక్తిలో భాసిల్లే ఆత్మారామునికి నమస్కారం 

ఇందులో ఏది ఉత్తమమైన నమస్కారం 

ఇది అర్థమైతే 

నాన్న ఉత్తమమైన సంస్కారం అర్థమౌతుంది 

మనుషుల మాటలలో అవమానాన్ని వెతికే వారు కాదు 

వాళ్ళ మాటలు వారి స్వభావాన్ని,

 పరిస్థితిని , తెలుసుకునే  అవకాశంగా భావించేవారు 


నేను నాన్నకి ఎన్నో చెప్పేదాన్ని 

నాన్నకి ఏమి తెలియదు నాకే అన్నీ తెలుసనుకుని 

నే చెప్పేవి అన్నీ వినేవారు 

"గుడ్డొచ్చి పిల్లనెక్కిరించిందని "

ఇదేంటి నాకు చెప్పేదేంటి 

అని ఎప్పుడూ అనలేదు , అనుకోలేదు 

ఎవరు ఏది చెప్పినా దాంట్లో 

సత్యాన్ని మాత్రమే వెతికే నిరహంకారి 


నాన్నని నేనేమైనా బాధ పెట్టానేమో అని 

మనస్సు చివుక్కుమనేది 

అడిగితే నేనేమి బాధపడలేదులే అని 

నా గిల్ట్  ఫీలింగ్స్ ని కూడా తుడిచిపెట్టేసేవారు  


ఎంత చక్కటి నాన్న 

అందరికీ ఉండనటువంటి నాన్న 

కొందరికి మాత్రమే ప్రాప్తమయ్యేటటువంటి నాన్న 

నాకు నాన్న 

I feel so proud of him and myself 


అమ్మ  తన నలభై తొమ్మిది ఏళ్ళ వయస్సులో 

 ఉన్నట్లుండి 

మృత్యు కుహరంలో మాయమవడంతో 

విధి మా కుటుంబాన్నిసుడిగుండంలోకి నెట్టివేసింది

 నాకు అప్పుడు ఇరవై మూడేళ్లు ,

తమ్ముడు  పదునెనిమిదేళ్ళ వాడు 


మనిషి ధైర్యాన్ని తెలుసుకోవాలంటే 

 జీవితంలో జరిగే దుర్ఘటనలప్పుడే గమనించాలి 

ఇరవై ఐదేళ్లు సహజీవనం చేసిన తన ప్రియధర్మచారిణి 

ఒక్క మాటైనా  తెలుపకుండా వీడుకోలు తీసుకుంటే 

కంట నీరు పొంగకుండా గుండె నిబ్బరంతో తన కర్తవ్యాన్ని పాటించారు 

అందరికి అలా నిలదొక్కుకోవడం సాధ్యం కాదు 


కొందరు ఆశ్చర్యపోయారు కొందరు ఇదేంటి విచిత్రం అనుకున్నారు 

కొందరు భార్య మీద ప్రేమ లేదేమో అని అనుమాన పడ్డారు 

హైందవ వేదాంతం నాన్నకి చేయూత నిచ్చింది 

బాధపడి ఏంలాభం మీ అమ్మ తొందరగా వెళ్ళిపోయింది అంతే అనేవారు 

నాకు అవసరమైన కష్ట కాలంలో చేదోడు వాదోడుగా సహాయపడ్డారు 

అమ్మ లేదనే కొరతని తగ్గించాలనే ప్రయత్నించారు

 చాలా మట్టుకు సఫలీకృతం చెందారు 

కానీ ఎంతైనా కొన్ని పరిస్థితులలో  అమ్మ అమ్మే 

అమ్మ లేని లోటు నాన్న పూర్తిగా తీర్చలేరు 


ఇలా వ్రాసుకుంటూ పోతే నాన్న గురించి 

నా గురించి ఎంతైనా వ్రాయొచ్చు . 


24, ఆగస్టు 2023, గురువారం

Mysterious Musings

 Mysterious Musings 


Oh dear when will you run freely in the meadows 

by your mother grazing aside 

and you loitering by in the fresh air 

watching the big blue sky 

with white clouds spread throughout  the vastness 

hearing the bells tingling around your neck and legs 

smelling scented red soil diffusing throughout in the moving wind 

ur' big beautiful eyes looking all around 

searching for someone or something 

ur' galloping hooves dancing here and there and everywhere 

lovely calf 

Why don't you come out of that boring cow barn  

 tied in the caged stall of dirt and untidiness 

swarm of flies flying around 

Don't be like us humans

 not wondering about the nature 

only using each other 

throwing away the trash but living in the filth of minds 

heights we reach but destroying everything and everyone 

on the way to the materialistic gains 

Oh my dear calf

 my eternal soul 

run into the unknown mysterious terrains 

for freedom in the love of God 


11, ఆగస్టు 2023, శుక్రవారం

Teachers Factory

కర్మాగారంలోకి ముడి సరుకుతో బాటు 

 income కూడా వస్తుంది

 product మాత్రం తయారు అవడం లేదు 

 కేవలం అదే material బైటకు  సమాజం లోకి వెళ్తుంది 

 కాని guaranteed product అనే stamp తో   

అసలుకే ఎసరు పడుతుంటే   

నాణ్యత  గోవిందార్పణం అని వేరే చెప్పాలా ?

 నును లేత బాల్యం పై , adolescence పై

 దీని ప్రభావం ఏమిటో   

 ఆ గారంటీడ్ ప్రోడక్ట్ 

human resource అయితేనో 

human investment అయితేనో 

దీని పర్యవసానం ఏంటో 

human capital గతి ఏంటో 

దేశ ప్రస్థాన పరిస్థితి ఏంటో 

 London  school of Economics 

 LSE product 

 మాత్రం చెప్పగలరేమో ! 

8, ఆగస్టు 2023, మంగళవారం

sky Garden

   

                                      మబ్బు పూలు 

ఆకాశం తోటలో మబ్బుపూలు 

ఒక్కొక్కటే తెంపుకుని

 నా కొంగులో నింపుకుని 

రోజూ  గుండె గూటిలో 

నిన్ను కొలుస్తున్నా దేవరా !

నీ దయతో నిండిన కనుచూపు 

కొంగున కట్టుకుని 

నా  జీవనయానం  కొనసాగిస్తున్నా 

మాదేవా ! 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Related Posts Plugin for WordPress, Blogger...