26, ఏప్రిల్ 2017, బుధవారం

DARSHANAM

                                                                       దర్శనం

శివుడొక్కండు ప్రత్యక్షంబే యైన  
సగమేన పార్వతిని నేనౌతా 

శివపార్వతులు చనుదెంచిన 
వారిరువురి మధ్య విగ్నేషుండు నేనౌతా  

మీ  మువ్వురు అగుపించిన స్మశానవాసా 
కార్తీకేయుండు నేనౌతా 

 హరా నీ కుటుంబమంతా కదలి వచ్చిన 
నందీశ్వరుడే నేనౌతా 

నందీ నీ వెంట ఉంటే దేవాది దేవా 
ప్రమథ గణాన్ని నేనౌతా 

సపరివార సమేతంగా నీవు 
తరలి వస్తివా ప్రభు 
భువిపైని నీ భక్తున్ని నేనౌతా 

ఈశ్వరా నేనే నీవై  
శివైక్యం  చెందుతా    
    

10, నవంబర్ 2016, గురువారం

Tamaswinii Thaadaapyam

                                         
                                                       తమస్వినీ తాదాప్యం 




నింగి నిశ్శబ్దంగా నేలను ముద్దిడితే  
 అవని విరబూసిన విరుల విలాసాలతో  
ఆకాశాన్ని కలవరిస్తున్న ఓ  నాటి నిశీధి   

నిశ్శబ్ద బంజరు భూములలో పరువులెత్తే పిల్లగాలికి 
ఊగిసలాడే ఆకుల సన్నటి అలికిడితో 
మిణుగురుల మెల్లని గాత్రాలతో 
సొంపుగా వంగిన పొదల మెత్తని ఊసులతో

నక్షత్రాలు నిండిన వినీల నిశి లో 
దిగంతాలకు వ్యాపించే ఓ  అంతరంగం 
అందాలు వెలిగే తెల్లని పావురాయై 
రెక్కలు విశాలంగా  విప్పుకుని గగనానికి ఎగరసాగింది 




జ్యోతిర్మయమైన ఆ బృందావన బృహత్ జ్యోత్స్నలకి  
గవాక్షాలే అక్షువులై సాక్షులై  సంకెళ్ళై చుట్టుముట్టిన   
సమున్నత భవన సముదాయాన్ని
 దాటి పై పైకి ఎగసిపోసాగింది 

దేదీప్యమానమై దహిస్తున్న వ్యవస్థ  వసారాలలో విహరించడం మాని
మాయావరణపు పొరలను కరిగించుకుంటూ 
చిక్కటి చీకటులను చేధించుకుంటూ  
ఆకశంలోకి పయణించసాగింది  

అంతలోనే  ఎందుకో మరి  
విసిగివేశారో , మరో ప్రపంచం తలుపులు తెరవనందుకో,
 విద్యుల్లతా ఘాతానికో,  ఆకర్షక దిగ్బంధనానికో 
ఘాఢతను సంతరించుకుని ఎవరికోసమో మరి
 దిగి భువిపైని గురుదత్తుని పాదాలపై వాలింది
రుణవిమోచనమెప్పుడో నని ఎదురుచూస్తుంది.  
                                                     


   
                                                                  An  Ecstasy Experience  
                                                                                  of 
                                                                          Soul travelling       


                                                          


                                                          


28, అక్టోబర్ 2016, శుక్రవారం

Koumudi

                                                          దోసిట  కౌముదీ చంద్రిక



నిశిలో కలల కౌముది మానసాకాశంలో
 ఘటనా నక్షత్రాల వల పరుస్తుంది
 నిద్రాణంగా ఉన్న ప్రభలమైన పావురాయి కోరిక 
రెక్క విప్పుకుని సంఘశృంఖలాలను తెంచుకుని
 జీవన్మాయను  ఛేదించుకుని 
వస్తు స్థల కాల లక్ష్మణ రేఖను దాటుకుని  
స్వేచ్ఛగా నిద్రానింగిలో విహరిస్తుంది 
యావధాత్రి ప్రాణ పరిమాణ క్రమంలో 
సోపానమైన సహజాత ఎర్రగులాబి 
అందాలని ఆనందాలని 
మీ దోసిట నింపుతుంది 
మీ మదిలో కౌముదీ చంద్రికలా
 కలకాలం వర్ధిల్లుతూ 
 పూర్ణత్వాన్ని సంతరించుకుని 
చిరకాల జ్ఞప్తికై కొలువుతీరుతుంది 
                                                                 ఫ్రాయిడ్ డ్రీమ్ సైకాలజీ 

6, మార్చి 2016, ఆదివారం

పారదర్సకత ( Transparency )


  
                                               
                                              పారదర్సకత  ( Transparency )            



కొన్ని విసిరే సవాళ్ళు 
పురుష పుంగవులకి  స్త్రీల ఆనవాళ్ళు 
సహృదయంతో స్పందిస్తే అరవిరిసే అందాలు 
సమాన ధర్మంతో తిలకిస్తే న్యాయ విన్యాస లాస్యాలు 
విశాల దృక్పథంతో  ఆస్వాదిస్తే ఆనంద మకరందాలు 






మేము పాదరసంలా సమయానుకూలంగా ఏ రూపమైనా                         సంతరించుకుoటాము 
మరి తమరు సగుణ స్వరూప వైవిధ్య అవసరాలను గుర్తించగలరా ?





 

మేము జీవన వికృతికి  వయో రుతువర్ణాల అందాలు అద్దగలము 
తమరు జీవన ప్రాకృతిక  సౌందర్యానికి  సహజత్వాన్ని ఆపాదించగలరా ?






మేము నిజం నింపాదిగా దర్శించి సున్నితంగా వాస్తవపు వాకిళ్ళు 
అలికి ముగ్గు సిగ్గు లయలలో జాలువారే జీవన తరంగంలా ఒద్దికగా ఒదగగలము 


   తమరు అధరాల జారే నిజాల పలుకుల కిరణాలతో వాస్తవాల వెలుగు                                                          లోగిళ్ళై  జీవించగలరా ?




మేము  జీతభత్యం లేని జీవన స్రవంతిలో మమేకమవగలము 
తమరు జీతమే లేని సేవని కనీసం డిగ్నిటి  అఫ్ లేబర్ గా  స్వీకరించగలరా ?


న్నీ అంగట్లో దొరుకుతున్న సూపర్ మార్కెట్ ప్రపంచంలో యూజ్ ఎండ్ త్రో వ్యాపార ధోరణిలో విద్య నుండి వివాహం దాకా, జననం నుంచి మరణం దాకా   రాషన్ కార్డ్  నుంచి  గ్రీన్ కార్డ్  దాకా, ప్రతీదీ కమర్షియలైజ్  అవుతున్న  ధనాకర్శణలో 

మా అస్థిత్వాన్ని మా వ్యక్తిత్వంతో  గెలుచుకోగలము 
తమరు ఈ అస్థిత్వ రణరంగంలో మా వ్యక్తిత్వనిర్మాణానికి సహకరించగలరా ?



మాయా మర్మం లేని అమాయకత్వపు ఆస్థులతో మోసం ద్వేషం లేని మనసులతో కల్మషం లేని  జీవన యానం సాగించగలము 


మా ఆదర్శపు ప్లేటోనిక్ లోకంపై అకృత్యం అత్యాచారం, మూఢాచారం, ఆధిపత్యం, దోపిడీతత్వం కారుమేఘాలై క్రమ్ముకుంటే గాలితెమ్మరలై పోరాడే మాతో కలిసి మీలో కిరాతకులని పాలద్రోలగలరా ? 


                      HAPPY WOMENS DAY



27, సెప్టెంబర్ 2015, ఆదివారం

MAYA

                                                                           మా య
  


నీకు నాకు మధ్య 
పలచని పారదర్శపు పొర  
గతంలో  ఎందరి మధ్యో అది పోలుసై అలుసై 
రాలిపోతే

మన మధ్య అది తెరై నీ ముసుగై 
లక్ష్మణ రేఖై వెక్కిరిస్తుంది 

ఆ తెర తీయగా రాదా  నీ ముసుగు వీడగరాదా ?


ఎవరికి ఎవరినైనా ఏ చింతా లేదు నాకు 
కాని నీ చింతనలో నేనెవరినో,
 అందరిలో ఒకరినో  అవడం 
అనిశ్చింత నాలో

నాలో నువ్వు ఎవరివో తెలియని నీవు 
పదిలంగా నిన్ను పొదువుకున్న  నేను
గడియ గడియకి నిను తడుముకున్న నేను 
  
నీ రాగం గానం మాట మౌనం వినే నేను 
నా ప్రాణం నా జీవం నా జీవితం అన్నీ నీవు  


నీ ఉత్పత్తి లో భాగమై  తృప్తికి కారణమై నందుకు కాదు 
కేవలం నీకు ఓ  ఒప్పందం కావడం
 అంతకు మించి ఏమి కాదన్న భావనం
 భాధాతీతం

అందరిపై చేసే ప్రయోగం నాపై ప్రయోగిస్తున్నారంటే 
నన్ను సహాయ పరికరంగా చూడనా 
మామూలైన దేవుని  అలవాటును
 నాకు కొత్తేమీ కాదనే విధి ధీమాను వీక్షించనా  

నన్ను కేవలం ప్రత్యుత్పతి  సాధనకు మరో మెట్టుగా గాంచనా 

నను తాకిన నీ స్పర్శ మానసికమైనదైనా 
                 అందరిని ఇదే విధాన ఆనందింప చేసిందని 
చేస్తున్నదని సంతసించనా 

 శా స్త్రీ య చికిత్సలు  అందరికి సుపరిచితమేనని 
 ఉదాహరణలలో గమనించి
     గత సాఫల్యాలను అనుమానించి  
          భీతినొన్దనా   

గతం ఎవరిదీ కాదు కాని
 నీ ప్రస్తుతం , భవిషత్తు 
 నాది కావాలనే ఆరాటం 
నిన్నటి నా రోదనైంది 

నీ గతంలో వ్యక్తులలాగే నేనూ కేవలం
 నీ కొక ఉదాహరణగా మాత్రమే  మిగిలిపోతానేమో అని 
చిన్నతనమనిపించింది 
నిన్ను వీడిపోతానేమోననే భయమేసింది 
దూరమవడానికే ఈ  ప్రయత్నమంతా అనిపించి భాధేసింది 

     



        

12, నవంబర్ 2013, మంగళవారం

ANDAM



అందం ఓ ప్రశాంత మౌన సరోవరం                   

మానసానందం ఆహ్లానందకరం 

ప్రేరణాత్మక త్రివేణి సంగమం 

మనశ్శాంతి, మనోధైర్య , మనోనిగ్రహం 

ఆ  సౌందర్య వీక్షణం  ఈ త్రిగుణ లభ్యం 

సుగమం 



అందం ఓ జాలువారే జలపాతం 

శిఖరాలను డీకొనే నర్తనం   

అయస్కాంత ఆకర్షణం 

మానసిక సమ్మోహనం 

బుద్ది వశ్యం  ఆ సౌoదర్య  వైనం   

సంద్రాన బిందువు ఐక్యం  అయ్యే 

చందం 

  

  

23, ఫిబ్రవరి 2013, శనివారం


                                         పనిమనిషి 

PM ని చప్రాసి  అంటే జనానికెంత కోపం 
పనిమనుషులు, చప్రాసీలు అంత లోకువేం 

దేశానికి PM ఓ నెలరోజులు ప్రక్కదేశానికి వెళ్ళితే మనకేం పర్వాలేదు 
కాని పనిమనిషి మూడు రోజులు ఊరేడితే ఉంటుంది తమాషా 

వేళకి కూడుండదు పైగా శ్రీమతి కస్సుబుస్సులు 
అంతా అస్థవ్యస్థం అగమ్య గోచరం 

బాబోయ్ పనిమనిషి 
పనిమనిషి రాదుటండి,  ఇంటికి రాగానే పెద్ద సమస్యా  పూరణం 

 జీవితం ఓ రణరంగం అన్నదెవరు మరిచేపోయా 
పనిమనుషుల వేట మనకిదేం ప్రారబ్ధం 

ఉన్నత పదవులు పెద్ద చదువులు గోప్పప్రపంచం అంతా
 పనిమనిషి   హట్టాత్ సెలవు ముందు దిగదుడుపే 
అదే మనకైతే పై ఆఫీసర్ ఎందుకు ముందే permission తీసుకోలేదని నిలదీస్తాడు శిలువేస్తాడు 

మరి పనిమనిషైతే  అడగనే కూడదు 
జీతం పెంపు పనితీరు అంతా వారి ఇష్టం , ఇష్టారాజ్యం 
పైగా మేము మనుషులమే అనే నినాదం 

వారి వాగ్ధాటికి చేతి వాటానికి అవలీలగా పని సర్దేసే నైపుణ్యానికి 
ఇల్లు అప్పచెప్పి నిశ్చేష్టులై కూర్చోవాలి,
 instructions నాట్ టు బి గివెన్ 
మాకు తెలియదా ఏంటి, ఊరకే చేబుతారేoటి తిరిగి మనకే వాయింపు

చెత్తే వేయకుండా ఇల్లు, తక్కువ గిన్నెలతో వంట, మురికే లేకుండా బట్టలు ఉండాలని మనకు ఉద్బోధ ఇలా ఉంటే ఇంక నీ గోలెందుకు గొంతు దాటి రాని మన బాధ  
  
ఇంట్లో వస్తువులు గాయబ్ అయినా మనం గప్ చిప్   
అడిగితివా అంతే సంగతి గొడవ మరో పనిమనిషికై వెతుకులాట 
పైగా కాలనీ అంతా మారుమ్రోగే అమాయకురాలిపై నేరం మోపామనే నీలాపనింద  

వేళకి చాయ్, అయ్యో పనిమనిషికి ముందు ఇవ్వాలండి అది వెళ్లిపోతుంది 
సరే ముందు దానికి తగలడి తరువాత నాకు కాస్త పొయి  
ఇక్కడ తిష్ట వేసుకుని  కూర్చుంది  నేనేగా స్వగతంలా  యజమాని వెళ్ళ గక్కుకునే ఖైధీ బాధ 

మిగిలిన పొడిలో కాస్త నీళ్ళు పోసి   టీ కాసిచ్చె  రోజులు పోయాయి
ఏoటమ్మ ఈ టీ ? నీకు పెట్టడం రాదా ఏంటి ? 
మేము మీకంటే చాలా చక్కగా చిక్కగా పెట్టుకుంటాం అని నిలదీసే రోజులొచ్చాయి  

పండగ   సాయంత్రం ఇచ్చినవన్నీ పట్టుకెళ్ళే  రోజులు పోయాయి 
మాకూ పండగలున్నాయి ,  మేమూ పండగ చేసుకోవాలి 
పూజలు , గుళ్ళు మాకూ అవసరమే అనే 
పండగ డుమ్మా వారి బర్త్ రైట్  
పాపం పండగ అల్లుళ్ళకి మాత్రం అత్తగార్లె పనిమనుషులు 

ఇలా రకరకాలుగా మనమంతా అవడంలేదు పనిమనుషులు?
PM అంటే ఫస్ట్ మినిస్టర్ , అంటే సిసలైన అర్థం డిక్షనరీ చూస్తే తేటతెల్లం 
వోట్ వేసే మనమే చప్రాసి అయినా అంతకంటే గొప్పే డెమోక్రసీ లో



ఏ depreciation కి లొంగనిది , hikeలు  తప్ప తరగనిది తగ్గనిది పనిమనుషుల జీతం 
పేపర్ పై లేని, earned లీవ్స్ లేని ,పరిమితి లేని CL'S  వాళ్ళవి 
వాళ్ళ గడుసుదనం ముందు మన తెలివి హుళక్కే 
 పనిమనిషి బలహీనతై  వేటు వేస్తుంది 
సమయాభావము బద్దకము అనారోగ్యము వెరసి పూర్తిగా వారిపై ఆధారపడేట్టు  చేస్తుంది 
అవసరం మన నోరు మూయిస్తుంది ,
 కుక్కిన పేనుల్లా పడి  ఉండేటట్లు మనని మారుస్తుంది unregistered, unofficial, జనపదులలాంటి పనిమనుషుల సంఘం   

రోజులు మారాయి, స్థితిమంతుల తిక్కలు కుదిరాయి 
పనిమనుషుల హక్కులు పెరిగి ముదిరాయి 

ఎందుకొచ్చిన గోల, ఏ పనిమనిషైనా ఇదంతా విని కేసు పెడుతుందో ఏమో,  
భారత స్వతంత్ర దేశంలో వాక్ స్వతంత్రం సరే, రాతలో స్వెచ్చకూడా  నీరుగారిపోతోంది 
బ్లాగ్ లో ఏదైనా రాయాలన్నా  భయపడే రోజులోచ్చాయ్ మరి       
తస్మాత్ జాగ్రత్త  జాగ్రత్త. 

  

    


31, డిసెంబర్ 2012, సోమవారం


శుభాకాంక్షలు  

మనిషి మనిషికి మధ్య రంగు, రూపు, గుణం, నైజం, మించిన మరో తేడా కులం 

ఆ వేర్పాటు సోపానాల రీతి , మనిషి విద్య ,సంస్కారం, పదవిని దాటి మనసుకి మనసుకి మధ్య 

పెదవి దాటి రాని భావవైకల్యమై కుసంస్కారమై, విద్యా సహజ సారం నిరుపయోగమై 

బీడై పోయిన సమాజం గౌరవ ప్రతిష్టలు కేవలం కులంలో కుచించుకుపోయిన వాస్తవం 

 ఛిత్కారాలతో  రాపిడికి రాటుదేలిన కొండశిలలలా  మూర్తిభవించిన సహనశీలులై 

నూన్యతను భరిస్తూ  ఆధిక్యతను సహిస్తూ వెటకారాలని వింటూ 

దొర రాజుల కోపాలకి తాపాలకి బలి అవుతూ ఉన్నత వర్గాలమని బెదిరించే సమూహాల వెలికి గురిఅవుతూ 

ఎన్నాళ్ళు ఈ   పరావర్త ప్రవర్తనం  సమసమాజ ముసుగు మరుగున కనిపించీ  కనిపించని వికృత నర్తనం 

కుల ధనం దాంపత్య జీవన ఆధారం, ప్రేమ దంపతుల మధ్య మటుమాయం 

కేవలం నిలిచేది సమాజం అంగీకరించే సహజాతం, ఆఖరికి మిగిలేది జంతు నైజం, అరణ్య జీవనం 

మనది మానుష జాతి కాదు, ప్రతి కులం ఓ జాతి, సింహాలు కుoదేళ్ళ తో కూడునా ?

ఇది కుల కుసంస్కార వాదనం 

ఒకే  రకమైన ఎన్నెన్నో సమ్మిళిత  అంశాలు 

సంపర్కం నుంచి నవమాసాల దాక, పెంపకం నుంచి మేధాశక్తి  దాక విజ్ఞానం నుంచి సృజనాత్మకత దాక 

టెస్ట్ ట్యూబ్  బేబి నుంచి సర్రోగేట్ మథర్  దాకా 

           ఇంతటి సారూప్యం , సామీప్యo మరి ప్రతి మనిషిలో, మనిషి మనిషి లో అంతో ఇంతో ఎందుకో 

భగవత్ సృష్టి కేవలం మనుష్య జాతి పరం,  మరి నర దృష్టి మానవనైజాన్ని దాటి 

కులాన్ని జాతిగా ఆవిష్కరించిన వైనం, మానవత్వం దేవుని వరం 

కులం మానవుని మతిభ్రమణం 

దైవం అన్ని మరపించి కేవలం కులం మాత్రమే ఒదిలి,  మిగితావన్నీతిరిగి అందిస్తే 

మనిషి జీవితం మహొన్నతం, మహదానందం, మనోజ్ఞం, వివాహ బంధాలు మధురాతి మధురం 

మనసు కేవలం మనసునే వెతుకుతుంది, తుమ్మెద  పూల మధువునే గ్రోలుతుంది 

మనిషి మాత్రం అవసరమైనవన్ని   వదిలి 

 కేవలం కులం మైకంలో మానవఅస్థిత్వాన్ని మరచిపోతున్నాడు 

 మరో కులపు మనిషిలోని దేవుని తూలనాడుతున్నాడు  

   
Cross breed , tissue culture అంటూ విజ్ఞానం చెట్లను  పండ్లను వ్యాపిస్తుంటే ప్రకృతిని శాసిస్తుంటే 

మనుషులు మాత్రం ఇంకా కులం కట్టుబాట్లతో సర్దుకుపోతున్నారు 

మనిషికి మనసే ముఖ్యమైతే కులం మనసు పరిధిలోకి రాదనే సత్యం సంఘం గుర్తించిన నాడు  

నూతన ఆరంభం,  సమసమాజం, సమన్యాయం, ప్రేమైక జీవనం, విశాల దృక్పథం,  నూతన సంవత్సరం 

సుభాభినందనం మరియు ఈడేరు యువత మనోరథం 

                     













29, డిసెంబర్ 2012, శనివారం

భావోద్రేకవాహిని




ఎందులకు నాకు ఈ భావోద్రేకం 

కారుణ్యాన్ని మూటగట్టుకోవడానికి  మాత్రం 

ససేమిరా కాదు 



నాలో ఉప్పొంగుతున్న స్వేచ్చాతరంగిణి 

నా ఉనికిని  పఠిష్ట పరుస్తూ 





ఎడారిలో ఓయాసిస్సులా పరివర్తన చెంది

 నిరాశా నిస్పృహలతో అలసి సొలసే నాలో స్త్రీత్వానికి  

నూతన శక్తిని ప్రసాదించేoదుకే 



నలుదిశలా క్రమ్ముకున్న  మూర్ఖత్వం , మూడ్డాచారం , డాంభికం  

గట్టులను త్రెంచుకుని పురుషాధికార కట్టుబాట్లను చేధిస్తూ

చెలియలి కట్ట దాటిన కడలిలా ప్రవహించేoదుకే, 



సమభావం , సహజీవనం స్థాపించేoదుకే 

నా ఈ భావోద్రేకప్రవాహం   చైతన్య రథప్రయాణం 

 నిరంతర పోరాటo  విప్లవజీవనయానం



    
"What we want to change we curse and then


pick up a tool. Bless whatever you can

with eyes and hands and tongue.


If you can't bless it, get ready to make it new."

~ M. Piercy ~


సమానధర్మం సమభావం 



Related Posts Plugin for WordPress, Blogger...